ARTICLE AD
TS ECET 2024 Results : తెలంగాణ ఈసెట్ - 2024 ఫలితాలు వచ్చేస్తున్నాయ్. ఇందుకు అధికారులు ముహుర్తం ఫిక్స్ చేశారు. మే 20వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. https://ecet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
బీటెక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం తెలంగాణ ఈసెట్ - 2024 పరీక్షను నిర్వహిస్తున్నారు. మే 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరిగింది. ఈ పరీక్ష ఫలితాల్లో వచ్చిన ర్యాంకల ఆధారంగా….. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశాలు పొందుతారు. ఈ ఏడాది ఈసెట్ పరీక్షను ఉస్మానియా వర్శిటీ నిర్వహించింది.
How to Check TS ECET 2024 Results : ఈసెట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు….
తెలంగాణ ఈసెట్ 2024 పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://ecet.tsche.ac.in/ లోకి వెళ్లాలి,హోమ్ పేజీలో కనిపించే 'టీఎస్ ఈసెట్ రిజల్ట్స్ - 2024 పై క్లిక్ చేయాలి.లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. టీఎస్ ఈసెట్ 2024 ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మీ ర్యాంక్ కార్డును పొందవచ్చు.తెలంగాణ పీజీఈసెట్ పరీక్షల షెడ్యూల్ మార్పు
TS PGECET 2024 Updates : తెలంగాణలో పీజీఈసెట్ -2024 పరీక్షల షెడ్యూల్ మారింది. ఈ మేరకు అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో PGECET రాత పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ ఏ అరుణ కుమారి వెల్లడించారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. పీజీఈసెట్ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. జూన్ 9వ తేదీతో ఎగ్జామ్స్ పూర్తి కావాలి. కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు, టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేశారు. తెలంగాణ పీజీఈసెట్ రాత పరీక్షలను జూన్ 10 నుంచి ప్రారంభించనున్నారు. జూన్ 13వ తేదీతో పూర్తి కానున్నాయి.
ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పీజీఈసెట్(TS PGECET 2024 ) ను నిర్వహిస్తున్నారు. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, , ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. https://pgecet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.