ARTICLE AD
తెలుగు న్యూస్ / తెలంగాణ / Ts Inter Supply Results 2024: ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల కాసేపట్లో
టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
ts inter supply results 2024: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు మధ్యాహ్నం 2 గంటలకు విడుదలకానున్నాయి.
Mon, 24 Jun 202408:26 AM IST
రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు https://tgbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. లేదా https://results.cgg.gov.in/ వెబ్ సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.
Mon, 24 Jun 202408:25 AM IST
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 4.5 లక్షల మంది హాజరు
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఇంప్రూవ్ మెంట్ రాసిన వారు కూడా ఉన్నారు.
Mon, 24 Jun 202408:25 AM IST
ఇంటర్ ద్వితీయ సంవత్సరం (మార్చి పరీక్షలు)
మార్చిలో నిర్వహించిన పరీక్షల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో జనరల్ విభాగంలో 69.46శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒకేషనల్ విద్యార్థుల్లో 63.86శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండు విభాగాల్లో కలిపి 64.19శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు జనరల్ విభాగంలో 4,01,445మంది హాజరయ్యారు. మరో 54,228మంది ప్రైవేట్‌గా పరీక్షలు రాశారు. ఒకేషనల్ కోర్సుల్లో 42,723మంది హాజరయ్యారు. ఇంటర్ సెకండియర్‌లో 1,77,109మంది 75శాతం పైగా మార్కులతో ఏ గ్రేడ్ సాధించారు. 68,378మంది 60శాతానికి పైగా మార్కులతో బి గ్రేడ్ సాధించారు. 25,478మంది 50శాతం మార్కులతో సి గ్రేడ్ దక్కించుకున్నారు. డి గ్రేడ్‌లో 7,891మంది ఉన్నారు. ఇంటర్ సెకండియర్‌లో మొత్తం 2,78,856మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్‌గా పరీక్షలు రాసిన 14,740మంది కూడా ఉత్తీర్ణత సాధించారు.
Mon, 24 Jun 202408:24 AM IST
మార్చిలో నిర్వహించిన పరీక్షల్లో 61.06 శాతం ఉత్తీర్ణత
మార్చిలో నిర్వహించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4,78,723మంది హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ ఇంటర్ విద్యార్ధులు 4,30,413మంది ఒకేషనల్ విద్యార్ధులు 48,310మంది ఉన్నారు. మొదటి సంవత్సరంలో మొత్తం 61.06శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విద్యార్ధుల్లో 50.57శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ జనరల్, ఒకేషనల్ కలిపి మొదటి సంవత్సరంలో 2,87,261 మంది ఉత్తీర్ణులుయ్యారు. ఉత్తీర్ణతా శాతం 60.01శాతంగా ఉంది.
Mon, 24 Jun 202408:16 AM IST
TS Inter Supplementary Results 2024 - ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల లింక్
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు https://tgbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. లేదా https://results.cgg.gov.in/ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.
ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మే/జూన్ - 2024 ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మీరు ఏ ఇయర్ పరీక్ష రాశారో అక్కడ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి… మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
సబ్మిట్ బటన్ పై నొక్కితే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
ప్రింట్ ఆప్షన్ పై నొక్కి ఫలితాల కాపీని పొందవచ్చు.
Mon, 24 Jun 202408:13 AM IST
జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
జూన్ 27వ తేదీ నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సిల్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ఈ ఏడాది మొత్తం మూడు విడతల్లో జరగనుంది. జూన్ 30 నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ కల్పించారు. జులై 12న తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 16వ తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
Mon, 24 Jun 202408:25 AM IST
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 4.5 లక్షల మంది హాజరు
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫెయిల్ అయిన వారితో పాటు ఇంప్రూవ్ మెంట్ రాసిన వారు కూడా ఉన్నారు.
Mon, 24 Jun 202408:06 AM IST
21 రోజుల వ్యవధిలోనే ఫలితాలు
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు గత నెల 24వ తేదీ నుంచి ప్రారంభమై… జూన్ 3వ తేదీతో ముగిశాయి. 21 రోజుల వ్యవధిలోనే ఫలితాలు వెలువడుతున్నాయి.
Mon, 24 Jun 202408:05 AM IST
మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు
నేడు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.