ARTICLE AD
Telangana Inter Supply Results 2024 : ఇవాళ తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 2గంటలకు విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలు గత నెల 24వ తేదీ నుంచి ప్రారంభమై…జూన్ 3వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫెయిల్ అయిన వారితో పాటు ఇంప్రూవ్ మెంట్ రాసిన వారు కూడా ఉన్నారు. వీరంతా కూడా ఫలితాలను బట్టి… ఇంజినీరింగ్ లేదా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
TS Inter Supplementary Results 2024 - ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల లింక్
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మే/జూన్ - 2024 ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.మీరు ఏ ఇయర్ పరీక్ష రాశారో అక్కడ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి… మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.సబ్మిట్ బటన్ పై నొక్కితే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.ప్రింట్ ఆప్షన్ పై నొక్కి ఫలితాల కాపీని పొందవచ్చు.జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్….
జూన్ 27వ తేదీ నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది మొత్తం మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. జూన్ 30 నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ కల్పించారు. జులై 12న తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. తొలి విడుతలో సీట్లు పొందిన విద్యార్థులు జూలై 16వ తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇక రెండో విడత కౌన్సెలింగ్ జులై 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మూడో విడత జూలై 30వ తేదీ నుంచి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జులై 24వ తేదీన ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు ఉండగా,ఆగస్టు 5వ తేదీన తుది విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు.
స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ఆగస్టు 17వ తేదీన మార్గదర్శకాలను విడుదల చేస్తారు. విద్యార్థులు రిపోర్టింగ్ చేసే సంఖ్యను బట్టి మిగిలే సీట్ల విషయంలో క్లారిటీ వస్తుంది. త్వరలోనే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.
TS EAPCET ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ 2024- ముఖ్య తేదీలు
జూన్ 27, 2024 - ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం.జూన్ 30, 2024 - ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు.జులై 12, 2024 - ఫస్ట్ ఫేజ్ ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.జూలై 12- 16, 2024 - సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ చేయాలి.జులై 19, 2024 - ఇంజినీరింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం.జులై 24, 2024 - సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపుజులై 30, 2024 - ఇంజినీరింగ్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్.ఆగస్టు 5, 2024 - ఇంజినీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు.ఆగస్టు 17, 2024 - స్పాట్ అడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదలఅధికారిక వెబ్ సైట్ - https://eapcet.tsche.ac.in/ఈసారి తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలో చూస్తే…. అగ్రికల్చర్ , ఫార్మ విబాగాలకు 91633 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 91.24 శాతం మంది పరీక్ష రాశారు. కాగా ఇంజనీరింగ్ విభాగంలో 2 లక్షల 40వేల 618 మంది పరీక్ష రాశారు. ఈసారి మొత్తం 3 లక్షల 32 వేల 251 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.