ARTICLE AD
తెలుగు న్యూస్ / తెలంగాణ / Ts Set 2024 Updates : తెలంగాణ సెట్ దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 28 నుంచి పరీక్షలు
TS SET 2024 Applications : తెలంగాణ సెట్ - 2024 దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హత కలిగిన అభ్యర్థులు http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూలై 2వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది.
తెలంగాణ సెట్ - 2024 దరఖాస్తులు ప్రారంభం (Photo Source http://telanganaset.org/)
TS SET 2024 Updates : తెలంగాణ సెట్ - 2024 ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 2వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆలస్య రుసుంతో జూలై 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
TS SET 2024 step guide to apply - సెట్ కు ఇలా అప్లయ్ చేసుకోండి
అర్హత కలిగిన అభ్యర్థులు. http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి,హోంపేజీలో కనిపించే ‘Apply Online’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత ఓపెన్ అయ్యే విండో లో మీ వివరాలను ఎంట్రీ చేయాలి. చివరగా కనిపించే Continue ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ఇక్కడ కావాల్సిన సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.ఆ తర్వాత నిర్ణయించిన దరఖాస్తు రుసుంను చెల్లించాలి.ఫైనల్ గా సబ్మిట్ ఆప్షన్ పై నొక్కితే మీ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది.రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది.దరఖాస్తు రుసుం :
ఓసీ అభ్యర్థులు రూ.2వేలు చెల్లించాలి.బీసీ అభ్యర్థులు రూ. 1500 చెల్లించాలి.SC, STలతో పాటు దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.ఈ ఏడాది కూడా తెలంగాణ సెట్ - 2024(Telangana State Eligibility Test Exam) పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ(OU) నిర్వహించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.
ఆగస్టు 28 నుంచి పరీక్షలు...
ఆగస్టు 20వ తేదీ నుంచి సెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఆగస్టు 28 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఆగస్టు 31వ తేదీతో ఎగ్జామ్స్ ముగుస్తాయని తెలంగాణ సెట్ అధికారులు వెల్లడించారు. http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
తెలంగాణ సెట్ ను 2 పేపర్లలో(TS SET Exam 2024) నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఇక పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులతో నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో మూడు గంటల పాటు పరీక్ష నిర్వహిస్తారు.