Union Minister Bandi Sanjay : కేంద్రమంత్రి హోదాలో రాక - కరీంనగర్ గడ్డకు బండి సంజయ్ సాష్టాంగ వందనం

5 months ago 89
ARTICLE AD

Union Minister Bandi Sanjay in Karimnagar : మాతృభూమికి బండి సంజయ్ వందనం చేశారు. కేంద్ర మంత్రి హోదాలో కరీంనగర్ కు తొలిసారిగా వచ్చిన ఆయన… నేలకు సాష్టాంగ నమస్కారం చేశారు. కేంద్రమంత్రి హోదాలో కరీంనగర్ కు వచ్చిన సంజయ్ కు ఆ పార్టీ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచిన సంజయ్ కు కేంద్రమంత్రి దక్కిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి ఆయన విజయం సాధించారు.

బండి సంజయ్ ప్రస్థానం ….

బండి సంజయ్ కుమార్ బాల్యం నుంచే సంజయ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో స్వయం సేవకుడిగా పనిచేశారు. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు (1994-1999; 1999-2003) డైరెక్టర్ గా కొనసాగారు.

బీజేపీ జాతీయ కార్యాలయం, దిల్లీలో ఎన్నికల ప్రచార ఇన్ ఛార్జ్ గా భారతీయ జనతా యువ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, వరుసగా రెండు పర్యాయాలు నగర బీజేపీ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టారు. ఎల్.కె అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇన్ ఛార్జ్ గా పనిచేశారు.

కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా 48వ డివిజన్ నుంచి 2005లో తొలిసారి బీజేపీ కార్పొరేటర్ గా, రెండోసారి 2010లో అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో సంజయ్ విజయం సాధించారు. 2014, 2018, 2023 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2016లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకమయ్యారు.

2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీ తరపున కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 66009 ఓట్లను సంపాదించి రెండో స్థానంలో ఉండగా, రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిల్చారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి, టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి 89508 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబెర్ గా నియామకమై ఇంకా కొనసాగుతున్నారు.‌ 2019 అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబెర్ గా టొబాకో బోర్డు మెంబెర్ గా, మైనారిటీ అఫైర్స్ స్టేట్ లెవెల్ కమిటీ మెంబెర్ గా, 2020 ఎయిమ్స్ బీబీనగర్ బోర్డు మెంబెర్ గా నియామకమై ఇంకా కొనసాగుతున్నారు.

2020 మార్చి 11 నుంచి 2023 జులై 3 వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు బండి సంజయ్. 2023 జులై 8న జాతీయ కార్యవర్గ సభ్యులుగా, 29 జులై 2023న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియామకమయ్యారు. 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, 89016 ఓట్లు సాధించి 3163 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2024 మే 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 5,85,116 ఓట్లు సాధించి, 2,25,209 మెజారిటీతో రెండోసారి ఎంపీగా ఘన విజయం సాధించారు.

2006 ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు 2,01,581 ఓట్లు రాగా, 2014లో వినోద్ కుమార్ కు 2,05,007 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఇవే అత్యధిక ఓట్లు కాగా.. తాజా ఫలితాలతో బండి సంజయ్ కుమార్ ఆ రికార్డులను బద్దలు కొట్టి, కరీంనగర్ చరిత్రలో మరో కొత్త రికార్డు నెలకొల్పారు.

Read Entire Article