Winter Care : చలికాలంలో సొంత వైద్యం ముప్పు.. ఈ 7 జాగ్రత్తలు పాటిస్తే ఎంతో మేలు!

1 month ago 31
ARTICLE AD

తెలంగాణ, ఏపీ ప్రజలను చలి చంపేస్తోంది. ఎంతోమందిని ఆస్పత్రుల పాలు చేస్తోంది. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో సొంత వైద్యం పనికి రాదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.

గత వారం రోజులుగా శ్వాసకు సంబంధించిన వ్యాధులతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వందలాది మంది ఓపీ సేవల కోసం, అత్యవసర చికిత్సకు వస్తున్నారు. వీరిలో చలికాలంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేని వారు ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు.

1.కరోనా తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ పెరిగింది. వారు చలికాలం ఉదయం బయటకు రావొద్దని.. మాస్కులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

2.చలిలో బయటకు రావడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరగదు. తిమ్మిర్లు వస్తుంటాయి. బయటకు వచ్చినప్పుడు శరీరం మొత్తం కప్పి ఉంచేలా జాగ్రత్తలు పాటించాలి. చేతులు, కాళ్లు అంతా కవర్ అయ్యేలా చూసుకోవాలి. వేడిది ఆహారం మాత్రమే తినేలా ఏర్పాట్లు చేసుకోవాలి.

3.దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు చలిలో వాకింగ్‌కు వెళ్లడం మంచిదికాదు. చలి తీవ్రత పెరగకముందు వెళ్లవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెళితే శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

4.రక్తపోటు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో వాకింగ్‌కు వెళ్లడం వల్ల అది మరింత పెరిగే ప్రమాదం ఉంది. సాయంత్రం 6 గంటలలోపే ఎక్సర్‌సైజ్ చేస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

5.చలి కాలంలో ఎక్కువ మంట కాగుతుంటారు. అది తాత్కాలిక ఉపశమనమే. చలి నుంచి రక్షణ కావాలంటే.. గోరువెచ్చని నీరు తాగాలి.

6.ఆస్తమా జెనెటిక్‌ సమస్య. చలికాలంలో ఎక్కువ అవుతుంది. ఆయాసంతో బాధపడుతుంటారు. చలికి దూరంగా ఉండటమే అస్తమాకు చికిత్స. రెగ్యులర్‌గా వాడే మందులను ఆపొద్దు, కంటిన్యూ చేయాలి.

7.చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. చల్లటి గాలుల కారణంగా ఎలర్జీ సమస్యలు వస్తాయి. దీని నుంచి బయటపడాలంటే.. మాస్కు ధరించడం మంచింది. విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండ్లు, ఆహారం తీసుకుంటే మేలు అని వైద్యులు సూచిస్తున్నారు.

Whats_app_banner

Read Entire Article