చంద్రబాబుతో పోటీపడే అవకాశం వచ్చింది - సీఎం రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

1 year ago 269
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  చంద్రబాబుతో పోటీపడే అవకాశం వచ్చింది - సీఎం రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

CM Revanth Reddy Latest News : ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడి పని చేసే అవకాశం తనకు లభించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బసవతారకం ఆస్పత్రి 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… ప్రభుత్వం తరపున బసవతారకం ఆస్పత్రికి పూర్తి సాకారం అందిస్తామని చెప్పారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Latest News : హైదరాబాద్ లోని బసవతారకం ఆస్పత్రి వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…  వైద్యారోగ్య సేవలో బసవతారకం లక్షలాది మందికి సేవలందిస్తోందని కొనియాడారు. తమ ప్రభుత్వం తరపున బసవతారకం ఆస్పత్రికి పూర్తి సాకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారని అన్నారు. “గతంలో తాను రోజుకు 12 గంటలు పని చేస్తే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు రోజుకూ 18 గంటలు పని చేస్తారు. ఆయన 18 గంటలు పనిచేసినప్పుడు.. నేను 12 గంటలు పని చేస్తే సరిపోదు. నాతో పాటు మా అధికారుల టీమ్ కూడా 18 గంటలు చేయాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబుతో పోటీ పడే అవకాశం నాకు దక్కింది. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలి.. ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి” అని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.

Read Entire Article