ARTICLE AD
దేశవ్యాప్తంగా జూలై 1వతేదీ నుంచి కొత్త చట్టాలు అమలులోకి వస్తున్నాయి. కేంద్ర రూపొందించిన ఇండియన్ పీనల్ కోడ్‌లలో కొన్నింటిని సవరించి కొత్త కోడ్‌లతో సరికొత్త నిబంధనలతో రూపొందించి అమలకు సర్వం సిద్ధం చేశారు.
కొత్త చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని పోలీస్ ఆఫీసర్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆదేశించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో సమావేశమై కొత్త చట్టాలపై దిశా నిర్దేశించేశారు.
మారిన చట్టాలు ఇవే
1.ఐపీసీ (పాతది) - భారతీయ న్యాయ సంహిత (కొత్తది )
2. సీఆర్పీసీ (పాతది) - భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (కొత్త )
3. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (పాత ది) - భారతీయ సాక్ష్య అధినియం (కొత్తది)
ఈ నేపథ్యంలో కొత్త చట్టాల పై అవగాహనా కోసం ప్రత్యేక న్యాయ విధాన పరిషత్, సదస్సులు, శిక్షణ కార్యక్రమలు విరివిగా ఏర్పాట్లు చేసి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఐపీసీ1860 కి బదులుగా భారతీయ న్యాయ సంహిత 2023, సి.ఆర్.పి.సి.1973 బదులుగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, ఇండియన్ ఎవిడన్స్ యాక్ట్ 1872 బదులుగా భారతీయ సాక్ష్య అధినియం 2023 లు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపారు. నూతన చట్టాల అమలుపై సమీక్షించారు.
వెసులుబాట్లు ఇవీ
బాధితులు పోలీస్ స్టేషనుకు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చని చట్టం చెబుతోంది. దీనిని జీరో FIR గా పరిణిస్తారు.
శిక్ష కన్నా న్యాయం అందించడం ప్రధాన లక్ష్యమని ఈ చట్టాలు చెబుతున్నాయి. మూక హత్యను తొలిసారిగా నిర్వచించారు. వ్యవస్తీకృత నేరాలపై కొత్త అధ్యాయన్ని ప్రవేశ పెట్టారు. ఉదాహరణ కు.. సమాజంలో మూక దాడులు, మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తు చేసి కఠినంగా వ్యవహరించి 2 నెలల్లో పూర్తి చేయాలని నూతన చట్టం చెబుతోంది. ఇక వీడియో సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు చెల్లు బాటులోకి వస్తాయి.
ఎప్పుడో బ్రిటిష్ కాలంలో సుమారు 120 సంవత్సరాలనుండి నుండి వస్తున్న పాత చట్టాలు ప్రస్తుతం సమాజ స్థితులకు అనుగుణంగా లేవని డాక్టర్ రణబీర్ సింగ్ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు భారత దేశ న్యాయ వ్యవస్థలో మార్పులు తీస్కొని రావడమే లక్ష్యంగా కేంద్రం నూతన చట్టాలు తీసుకొచ్చింది.
మహంతి సమీక్ష
జులై నెల నుండి మారిన చట్టాలకు అనుగుణంగా కేసులు నమోదు చేయాలని కరీంనగర్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆదేశించారు. అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్.హెచ్.ఓ.లు బాధ్యతతో విధిగా నూతన చట్టాలను అమలు చేయాలన్నారు. అమలు చేయబోవు నూతన చట్టాలపై ఏర్పడే సందేహాలను నివృత్తి చేసుకుంటూ సరైన సెక్షన్లను ప్రయోగించాలన్నారు. నేరస్థులు తప్పించుకొనుటకు వీలులేకుండా, బాధితులకు న్యాయం జరిగేలా పకడ్బందీగా నూతన చట్టాలు అమలు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఎ. లక్ష్మీనారాయణ, ఏసీపీలు శ్రీనివాస్, నరేందర్, శ్రీనివాస్ జి , విజయకుమార్, కాశయ్య లతో పాటు జిల్లాలోని అన్ని విభాగాల ఇన్స్పెక్టర్లు, ఆర్ ఐ వెల్ఫేర్ శ్రీధర్ రెడ్డి లు పాల్గొన్నారు.
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆర్మ్‌డ్ రిజర్వు హెడ్ కానిస్టేబుల్ మేకల శ్రీనివాస్ గుండెపోటుతో మృతిచెందారు. 1995 వ సంవత్సరం లో పోలీస్ కానిస్టేబుల్ గా విధుల్లో చేరిన శ్రీనివాస్ విధినిర్వహణలో ఉండగా అస్వస్థతకు గురై పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాస్ ఆకాలమరణంతో పోలీస్ అధికారులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. స్వస్థలం ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు. అంత్యక్రియల్లో అడిషనల్ డీసీపీ (ఏఆర్) అనోక్ జైన్ పాల్గొన్నారు.