Iran Israel War: ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్, ఇండియాలో పెట్రోల్ ధరల బాదుడు!

 Israel Iran War: మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా వెంటనే అది పెట్రో ధరలపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయేల్, ఇరాన్ యుద్ధంతో ఆ ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 1% మేర పెరిగాయి. ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయేల్‌ యుద్ధ విమానం దాడి చేసిందన్న వివాదంతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడిప్పుడే తీవ్ర రూపం దాల్చుతోంది. అటు ఇరాన్‌ ఇజ్రాయేల్‌పై మిజైల్స్‌తో విరుచుకుపడింది. ఈ ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకి అంతరాయం కలిగే ప్రమాదముంది. ఇరాన్‌ దాడులు మొదలు పెట్టిన తరవాత చమురు ధరలపై కచ్చితంగా ప్రభావం ఉంటుందని అనలిస్ట్‌లు చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ధరల్లో మార్పు మొదలైంది. సూయెజ్ కాలువని మూసేస్తామని ఎప్పటి నుంచో ఇరాన్‌ బెదిరిస్తోంది. అదే జరిగితే చమురు సరఫరాకి బ్రేక్ పడుతుంది. ధరలూ పెరిగిపోతాయి. నిజానికి...ఇజ్రాయేల్-గాజా యుద్ధంతోనే అంతర్జాతీయంగా చమురు ధరలపై ప్రభావం పడింది. ఇప్పుడు ఇరాన్‌ కూడా వచ్చి చేరడం వల్ల ధరలు మరింత పెరిగే అవకాశముంది. ప్రస్తుతానికి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80డాలర్లుగా ఉంది. అయితే...ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదిరితే మాత్రం దాదాపు 100 డాలర్ల వరకూ ధరలు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మార్కెట్‌లో స్థిరత్వం కోసం ఇప్పటికే OPEC చమురు సరఫరాని కొంత వరకూ తగ్గించాయి. ధరల్లో పెద్దగా మార్పు లేకపోయినా...ఇప్పుడు ఇరాన్‌,ఇజ్రాయేల్ యుద్ధంతో కచ్చితంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  భారత్‌పైనా ఎఫెక్ట్.. చమురుని భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్న భారత్‌లో ఈ ఎఫెక్ట్ గట్టిగానే కనిపించేలా ఉంది. ఇలాంటి టెన్షన్స్ ఎప్పుడు వచ్చినా భారత్‌ చమురు ధరలు మారుతూ ఉంటాయి. మధ్యప్రాచ్యంపైనే చమురు దిగుమతుల కోసం ఎక్కువగా ఆధార పడడం వల్ల ఇక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇక్కడ ఇండియన్స్‌కి పెట్రోల్ డీజిల్ ధరలు మారిపోతున్నాయి. అయితే..కేవలం మధ్యప్రాచ్య దేశాలపైనే కాకుండా వేరే దేశాల నుంచీ దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది భారత్. రష్యా నుంచి 2023లో 35% మేర చమురు దిగుమతి చేసుకుంది. అప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ప్రభావం పడింది. ఆ సమస్య రాకుండానే నేరుగా రష్యాతోనే ఒప్పందం కుదుర్చుకుని చమురు తెచ్చుకుంది. ఇప్పుడు కూడా మళ్లీ రష్యాపైనే ఆధారపడుతుందా అన్నదే కీలకంగా మారింది. ఇజ్రాయేల్, ఇరాన్‌ యుద్ధంపై ఇప్పటికే భారత్ స్పందించింది. రెండు దేశాలూ శాంతించాలని కోరింది. కవ్వింపు చర్యలు ఆపేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచ దేశాలూ ఈ యుద్ధంపై ఉత్కంఠగా ఉన్నాయి. ఎప్పుడు ఇది ఉద్రిక్తంగా మారుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్‌ దాడుల్ని ఖండించిన అమెరికా ఇజ్రాయేల్‌కి అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించింది. అటు ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఎదురు దాడికి సిద్ధంగా ఉండాలంటూ సైన్యానికి ఆదేశాలిచ్చారు. ఫలితంగా రానున్న రోజుల్లో ఇది ఎటుకి దారి తీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.  Also Read: Israel-Iran War: ఇజ్రాయేల్‌పై మిజైల్స్‌తో దాడి చేసిన ఇరాన్, ఉలిక్కిపడ్డ ప్రపంచం  

Apr 14, 2024 - 16:00
 0  11
Iran Israel War: ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్, ఇండియాలో పెట్రోల్ ధరల బాదుడు!

 Israel Iran War: మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా వెంటనే అది పెట్రో ధరలపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయేల్, ఇరాన్ యుద్ధంతో ఆ ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 1% మేర పెరిగాయి. ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయేల్‌ యుద్ధ విమానం దాడి చేసిందన్న వివాదంతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడిప్పుడే తీవ్ర రూపం దాల్చుతోంది. అటు ఇరాన్‌ ఇజ్రాయేల్‌పై మిజైల్స్‌తో విరుచుకుపడింది. ఈ ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకి అంతరాయం కలిగే ప్రమాదముంది. ఇరాన్‌ దాడులు మొదలు పెట్టిన తరవాత చమురు ధరలపై కచ్చితంగా ప్రభావం ఉంటుందని అనలిస్ట్‌లు చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ధరల్లో మార్పు మొదలైంది.

సూయెజ్ కాలువని మూసేస్తామని ఎప్పటి నుంచో ఇరాన్‌ బెదిరిస్తోంది. అదే జరిగితే చమురు సరఫరాకి బ్రేక్ పడుతుంది. ధరలూ పెరిగిపోతాయి. నిజానికి...ఇజ్రాయేల్-గాజా యుద్ధంతోనే అంతర్జాతీయంగా చమురు ధరలపై ప్రభావం పడింది. ఇప్పుడు ఇరాన్‌ కూడా వచ్చి చేరడం వల్ల ధరలు మరింత పెరిగే అవకాశముంది. ప్రస్తుతానికి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80డాలర్లుగా ఉంది. అయితే...ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదిరితే మాత్రం దాదాపు 100 డాలర్ల వరకూ ధరలు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మార్కెట్‌లో స్థిరత్వం కోసం ఇప్పటికే OPEC చమురు సరఫరాని కొంత వరకూ తగ్గించాయి. ధరల్లో పెద్దగా మార్పు లేకపోయినా...ఇప్పుడు ఇరాన్‌,ఇజ్రాయేల్ యుద్ధంతో కచ్చితంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

భారత్‌పైనా ఎఫెక్ట్..

చమురుని భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్న భారత్‌లో ఈ ఎఫెక్ట్ గట్టిగానే కనిపించేలా ఉంది. ఇలాంటి టెన్షన్స్ ఎప్పుడు వచ్చినా భారత్‌ చమురు ధరలు మారుతూ ఉంటాయి. మధ్యప్రాచ్యంపైనే చమురు దిగుమతుల కోసం ఎక్కువగా ఆధార పడడం వల్ల ఇక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇక్కడ ఇండియన్స్‌కి పెట్రోల్ డీజిల్ ధరలు మారిపోతున్నాయి. అయితే..కేవలం మధ్యప్రాచ్య దేశాలపైనే కాకుండా వేరే దేశాల నుంచీ దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది భారత్. రష్యా నుంచి 2023లో 35% మేర చమురు దిగుమతి చేసుకుంది. అప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ప్రభావం పడింది. ఆ సమస్య రాకుండానే నేరుగా రష్యాతోనే ఒప్పందం కుదుర్చుకుని చమురు తెచ్చుకుంది. ఇప్పుడు కూడా మళ్లీ రష్యాపైనే ఆధారపడుతుందా అన్నదే కీలకంగా మారింది.

ఇజ్రాయేల్, ఇరాన్‌ యుద్ధంపై ఇప్పటికే భారత్ స్పందించింది. రెండు దేశాలూ శాంతించాలని కోరింది. కవ్వింపు చర్యలు ఆపేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచ దేశాలూ ఈ యుద్ధంపై ఉత్కంఠగా ఉన్నాయి. ఎప్పుడు ఇది ఉద్రిక్తంగా మారుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్‌ దాడుల్ని ఖండించిన అమెరికా ఇజ్రాయేల్‌కి అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించింది. అటు ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఎదురు దాడికి సిద్ధంగా ఉండాలంటూ సైన్యానికి ఆదేశాలిచ్చారు. ఫలితంగా రానున్న రోజుల్లో ఇది ఎటుకి దారి తీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

Also Read: Israel-Iran War: ఇజ్రాయేల్‌పై మిజైల్స్‌తో దాడి చేసిన ఇరాన్, ఉలిక్కిపడ్డ ప్రపంచం

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow