Zubeda Ali: సీనియర్ నటి రాధ కోసం స్పెషల్ బిర్యానీ చేసిన ఆలీ భార్య - చూస్తే నోరూరుతుంది

Zubeda Ali Special Food To Radha: జుబేదా ఆలీ... ఒక‌ప్పుడు ఈమె ఎవ‌రో ఎవ్వ‌రికీ తెలీదు. కానీ, ఇప్పుడు ఆలీతో స‌మానంగా ఫేమ్ తెచ్చుకున్నారు. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి, బీభ‌త్స‌మైన ఫాలోయింగ్ పెంచేసుకున్నారు. ఇక ఎప్పుడూ ఇంట్లో చేసే నాన్ వెజ్ వెరైటీలు, నెల నెల బీద‌వారికి పంచే ఆహారం.. ఇలా ఎన్నో రకాల వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆమె అల‌నాటి న‌టి రాధ‌కు త‌న చేతి వంట రుచి చూపించార‌ట‌. దానికి సంబంధించి వ్లాగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.  ఆలీతో స‌ర‌దాగా సెట్ కి జుబేదా వంట‌లు..  ఆలీ వాళ్ల ఇంట్లో ఎప్పుడూ నాన్ వెజ్ వంట‌లు వండుతూనే ఉంటారు. స్పెష‌ల్ చేస్తూనే ఉంటారు ఆమె. ఆలీకి షూటింగ్ స్పాట్ కి తీసుకెళ్తూ ఉంటారు. అలా ఈరోజు ఆమె ఆలీతో స‌రదాగా షూట్ కి స్పెష‌ల్స్ చేసుకుని వెళ్లారు. ఆలీతో స‌ర‌దాగా సీజ‌న్ -  2 స్టార్ట్ అవుతున్న నేప‌థ్యంలో గెస్ట్ గా రాధ‌గారు వ‌చ్చార‌ని, ఆమెకు స్పెష‌ల్స్ చేస్తున్నాని చెప్తూ వీడియో తీశారు జుబేదా. ఆమె కోసం స్పెష‌ల్ మ‌ట‌న్ బిర్యానీ, మ‌ట‌న్ దాల్చా, చికెన్ ఘీ రోస్ట్, షీర్ కుర్మా చేశారు ఆమె. ఇక తానే స్వ‌యంగా షూటింగ్ స్పాట్ లో రాధకి వ‌డించారు. ఫుడ్ బాగుంద‌ని ఆమె చెప్పార‌ని ఆ వ్లాగ్ లో చెప్పారు జుబేదా. హోస్ట్ గా ఫ‌స్ట్ షో..    ఆలీ క‌మెడియ‌న్ గా అంద‌రికీ బాగా ప‌రిచ‌యం. అయితే, ఆయ‌న హోస్ట్ గా ప‌రిచ‌యం అయ్యింది మాత్రం అలీతో స‌ర‌దాగా షోతోనే. ఎంతోమంది సెల‌బ్రిటీల‌ను ఆ షోలో త‌నదైన శైలీలో ఇంట‌ర్వ్యూ చేశారు ఆలీ. ఇక ఇప్పుడు సీజ‌న్ - 2 స్టార్ట్ అయ్యింది. ఆలీ 369, ఆలీతో స‌ర‌దాగా, ఆలీతో జాలీగా పేర్ల‌తో ఆయ‌న అదే షో ఎన్నో సీజ‌న్స్ చేశారు.  స్పెష‌ల్ గిఫ్ట్స్..  ఇక ఆ షూటింగ్ కి వెళ్లిన జుబేదా ఆలీతో స‌ర‌దాగా టీమ్ మొత్తానికి స్పెష‌ల్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఆలీతో స‌ర‌దాగా - 2 స్టార్ట్ అవ్వ‌బోతోంద‌ని, అందుకే ఈ గిఫ్ట్స్ ఇస్తున్నామ‌ని చెప్పారు. టీమ్ మొత్తానికి కుక్క‌ర్లు పంచారు జుబేదా, ఆలీ. గ‌తంలో కూడా  తాము హాట్ బాక్సులు ఇచ్చామ‌ని, అది త‌మ‌కు తృప్తినిస్తుంద‌ని చెప్పారు ఆమె.  వంట‌ల స్పెష‌ల్..  జుబేదా ఆలీ త‌న యూట్యూబ్ స్టార్ట్ చేసిన త‌ర్వాత వంట‌ల్లో ఎన్ని స్పెషల్స్ ఉంటాయో అన్ని చేసి షూట్ చేసి పోస్ట్ చేస్తారు. నెల‌కు ఒక‌సారి ర‌క‌ర‌కాల ఫుడ్స్ చేసి, బీద‌ల‌కు పంచుతారు ఆమె. తన అత్త‌గారు చేసిన స్పెష‌ల్స్ నేర్చుకుని తాను వండుతున్నాన‌ని చెప్తారు ఆమె. అలా త‌న భ‌ర్త షూటింగ్ హైద‌రాబాద్ లో ఉంటే.. ఆమె స్వ‌యంగా అంద‌రికీ వంట చేసి పంపిస్తారు. అలా ఎన్నో వీడియోలు కూడా చేశారు జుబేదా. ఆమె వంట‌ల‌కే స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. Also Read: పవన్ కళ్యాణ్ రియల్ పుట్టిన రోజు తేదీ ఇదేనట - పవర్ స్టార్ వయస్సుపై జోరుగా చర్చ

Apr 24, 2024 - 21:00
 0  1
Zubeda Ali: సీనియర్ నటి రాధ కోసం స్పెషల్ బిర్యానీ చేసిన ఆలీ భార్య - చూస్తే నోరూరుతుంది

Zubeda Ali Special Food To Radha: జుబేదా ఆలీ... ఒక‌ప్పుడు ఈమె ఎవ‌రో ఎవ్వ‌రికీ తెలీదు. కానీ, ఇప్పుడు ఆలీతో స‌మానంగా ఫేమ్ తెచ్చుకున్నారు. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి, బీభ‌త్స‌మైన ఫాలోయింగ్ పెంచేసుకున్నారు. ఇక ఎప్పుడూ ఇంట్లో చేసే నాన్ వెజ్ వెరైటీలు, నెల నెల బీద‌వారికి పంచే ఆహారం.. ఇలా ఎన్నో రకాల వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆమె అల‌నాటి న‌టి రాధ‌కు త‌న చేతి వంట రుచి చూపించార‌ట‌. దానికి సంబంధించి వ్లాగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. 

ఆలీతో స‌ర‌దాగా సెట్ కి జుబేదా వంట‌లు.. 

ఆలీ వాళ్ల ఇంట్లో ఎప్పుడూ నాన్ వెజ్ వంట‌లు వండుతూనే ఉంటారు. స్పెష‌ల్ చేస్తూనే ఉంటారు ఆమె. ఆలీకి షూటింగ్ స్పాట్ కి తీసుకెళ్తూ ఉంటారు. అలా ఈరోజు ఆమె ఆలీతో స‌రదాగా షూట్ కి స్పెష‌ల్స్ చేసుకుని వెళ్లారు. ఆలీతో స‌ర‌దాగా సీజ‌న్ -  2 స్టార్ట్ అవుతున్న నేప‌థ్యంలో గెస్ట్ గా రాధ‌గారు వ‌చ్చార‌ని, ఆమెకు స్పెష‌ల్స్ చేస్తున్నాని చెప్తూ వీడియో తీశారు జుబేదా. ఆమె కోసం స్పెష‌ల్ మ‌ట‌న్ బిర్యానీ, మ‌ట‌న్ దాల్చా, చికెన్ ఘీ రోస్ట్, షీర్ కుర్మా చేశారు ఆమె. ఇక తానే స్వ‌యంగా షూటింగ్ స్పాట్ లో రాధకి వ‌డించారు. ఫుడ్ బాగుంద‌ని ఆమె చెప్పార‌ని ఆ వ్లాగ్ లో చెప్పారు జుబేదా.

హోస్ట్ గా ఫ‌స్ట్ షో.. 

 

ఆలీ క‌మెడియ‌న్ గా అంద‌రికీ బాగా ప‌రిచ‌యం. అయితే, ఆయ‌న హోస్ట్ గా ప‌రిచ‌యం అయ్యింది మాత్రం అలీతో స‌ర‌దాగా షోతోనే. ఎంతోమంది సెల‌బ్రిటీల‌ను ఆ షోలో త‌నదైన శైలీలో ఇంట‌ర్వ్యూ చేశారు ఆలీ. ఇక ఇప్పుడు సీజ‌న్ - 2 స్టార్ట్ అయ్యింది. ఆలీ 369, ఆలీతో స‌ర‌దాగా, ఆలీతో జాలీగా పేర్ల‌తో ఆయ‌న అదే షో ఎన్నో సీజ‌న్స్ చేశారు. 

స్పెష‌ల్ గిఫ్ట్స్.. 

ఇక ఆ షూటింగ్ కి వెళ్లిన జుబేదా ఆలీతో స‌ర‌దాగా టీమ్ మొత్తానికి స్పెష‌ల్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఆలీతో స‌ర‌దాగా - 2 స్టార్ట్ అవ్వ‌బోతోంద‌ని, అందుకే ఈ గిఫ్ట్స్ ఇస్తున్నామ‌ని చెప్పారు. టీమ్ మొత్తానికి కుక్క‌ర్లు పంచారు జుబేదా, ఆలీ. గ‌తంలో కూడా  తాము హాట్ బాక్సులు ఇచ్చామ‌ని, అది త‌మ‌కు తృప్తినిస్తుంద‌ని చెప్పారు ఆమె. 

వంట‌ల స్పెష‌ల్.. 

జుబేదా ఆలీ త‌న యూట్యూబ్ స్టార్ట్ చేసిన త‌ర్వాత వంట‌ల్లో ఎన్ని స్పెషల్స్ ఉంటాయో అన్ని చేసి షూట్ చేసి పోస్ట్ చేస్తారు. నెల‌కు ఒక‌సారి ర‌క‌ర‌కాల ఫుడ్స్ చేసి, బీద‌ల‌కు పంచుతారు ఆమె. తన అత్త‌గారు చేసిన స్పెష‌ల్స్ నేర్చుకుని తాను వండుతున్నాన‌ని చెప్తారు ఆమె. అలా త‌న భ‌ర్త షూటింగ్ హైద‌రాబాద్ లో ఉంటే.. ఆమె స్వ‌యంగా అంద‌రికీ వంట చేసి పంపిస్తారు. అలా ఎన్నో వీడియోలు కూడా చేశారు జుబేదా. ఆమె వంట‌ల‌కే స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Also Read: పవన్ కళ్యాణ్ రియల్ పుట్టిన రోజు తేదీ ఇదేనట - పవర్ స్టార్ వయస్సుపై జోరుగా చర్చ

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow