ARTICLE AD
పండ్లు, కూరగాయల ఉత్పత్తిదారులతో పాటు పట్టణ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో 1988లో మదర్ డైరీ సఫల్ ను ప్రారంభించింది కేంద్రం. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ అనుబంధ సంస్థగా ఇది ఉంది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, గుర్గావ్ తో పాటు బెంగళూరులోని 23 ఔట్‌లెట్లు సహా దాదాపు 400 రిటైల్ అవుట్‌లెట్లను నిర్వహిస్తోంది. ప్రతి రోజు 1.5 లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. దాదాపు 120 SKU (స్టాక్ కీపింగ్ యూనిట్)ల తాజా పండ్లు, కూరగాయలను అందిస్తోంది. సఫల్ షాపులను ప్రధానంగా మాజీ సైనికులు లేదా వారిపై ఆధారపడి జీవించే వారు నిర్వహిస్తున్నారు. లాభదాయకమైన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారికి ప్రత్యేక అవకాశాన్ని మదర్ డైరీ సఫల్ అందిస్తోంది.
మదర్ డైరీ సఫల్ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని ప్రారభించడం చాలా సులభం. అలాగే లాభాదాయకంగా ఉంటుంది. మరీ ఈ వెంచర్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి, ప్రాసెస్ ఏంటి అనే వివారుల ఇప్పుడు చూద్దాం.
* AWPO (ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్) దరఖాస్తు ఫారంను నింపి అన్ని వివరాలు పొందుపరచాలి.
ఫ్రాంచైజీకి మీరు సూట్ అవుతారో లేదో అంచనా వేసేందుకు సఫల్, AWPO సంయుక్త ఇంటర్వ్యూను నిర్వహిస్తాయి.
డిపాజిట్ సెక్యూరిటీ అండ్ వర్కింగ్ క్యాపిటల్ డ్రాఫ్ట్