EPFO: ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్‌..ఇకపై ఉద్యోగులే ‘డేట్ ఆఫ్ ఎగ్జిట్’ అప్‌డేట్ చేసుకోవచ్చు

1 year ago 633
ARTICLE AD

EPFO: మెరుగైన కెరీర్ కోసం ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారుతుంటారు. ఈ క్రమంలో పాత కంపెనీలో ఎగ్జిట్ ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా, ప్రావిడెంట్‌కి సంబంధించిన క్లియరెన్స్‌ తీసుకోవాలి. ఇందుకు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఆన్‌లైన్‌లో వివిధ సేవలను అందిస్తోంది. అయితే కొత్త కంపెనీలో చేరినప్పుడు పాత ఈపీఎఫ్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడే కొందరికి ‘డేట్ ఆఫ్ ఎగ్జిట్’ సమస్య ఎదురవుతుంది. ఈ ‘డేట్ ఆఫ్ ఎగ్జిట్’ని అప్‌డేట్ చేసే అధికారం కంపెనీలకే కాకుండా ఉద్యోగులకు కూడా ఉందని ఇటీవల ఈపీఎఫ్‌వో వెల్లడించింది. ఉద్యోగులే ‘డేట్ ఆఫ్ ఎగ్జిట్’ని అప్‌డేట్ చేసుకోవచ్చని ట్విటర్‌లో తెలిపింది.

కొత్త మెంబర్ ఐడీ తప్పనిసరి

ఉద్యోగి కంపెనీ మారినప్పుడు ఆ సంస్థ ఉద్యోగిగా కొత్త పీఎఫ్ మెంబర్ ఐడీని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పాత పీఎఫ్ అకౌంట్‌లోని ప్రావిడెంట్ ఫండ్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్(UAN) సహాయంతో కొత్త పీఎఫ్ అకౌంట్‌ని ఓపెన్ చేయొచ్చు. ఉద్యోగులు ‘డేట్ ఆఫ్ ఎగ్జిట్’ని అప్‌డేట్ చేసుకోవడానికి మెంబర్ సేవా పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలని తెలిపింది. ఆ ప్రాసెస్‌ ఎలాగో చూద్దాం.

పీఎఫ్ అకౌంట్‌ని ఎంచుకున్నాక కంపెనీలో పనిచేసిన చివరి రోజు(డేట్ ఆఫ్ ఎగ్జిట్)ను ఎంటర్ చేయాలి. ఇదే డేట్ ఆఫ్ ఎగ్జిట్‌ని మరోసారి ఎంటర్‌ చేయాలి. అనంతరం, కంపెనీ నుంచి బయటకు వచ్చినందుకు గల కారణాన్ని పేర్కొనాలి. కంపెనీ మారారు కాబట్టి, ‘సెషేషన్’(Cessation)ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఓటీపీని రిక్వెస్ట్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి చెక్ బాక్స్‌పై సెలక్ట్ చేసుకోవాలి. ‘అప్‌డేట్’పై క్లిక్ చేసి ‘ఓకే’(OK)పై క్లిక్ చేస్తే ప్రాసెస్ పూర్తయినట్లే.

 2 నెలల తర్వాతే ఛాన్స్

కంపెనీ మారిన అనంతరం రెండు నెలల వరకు ‘డేట్ ఆఫ్ ఎగ్జిట్’ని అప్‌డేట్ చేసేందుకు వీలుండదు. కంపెనీ నుంచి ఎగ్జిట్ అయ్యాక రెండు నెలల వరకు సంస్థ పీఎఫ్ అకౌంట్‌లో ఏమైనా జమ చేసిందో లేదో సిస్టం చెక్ చేస్తుంది. ఒకవేళ ఎలాంటి ట్రాన్సాక్షన్లు జరగకుంటే ‘డేట్ ఆఫ్ ఎగ్జిట్’ రిక్వెస్ట్‌ని అనుమతిస్తుంది. లేదంటే ప్రాసెస్‌ని అక్కడే ఆపేస్తుంది.

Read Entire Article