Telangana News Live August 30, 2024: Caste Discrimination : 'మీరు బోనం పెట్టొద్దు'...! దళితులను గుడిలోకి రాకుండా అడ్డగింత, సిద్ధిపేట జిల్లాలో ఘటన

2 months ago 84
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live August 30, 2024: Caste Discrimination : 'మీరు బోనం పెట్టొద్దు'...! దళితులను గుడిలోకి రాకుండా అడ్డగింత, సిద్ధిపేట జిల్లాలో ఘటన

 'మీరు బోనం పెట్టొద్దు'...! దళితులను గుడిలోకి రాకుండా అడ్డగింత, సిద్ధిపేట జిల్లాలో ఘటన

Caste Discrimination : 'మీరు బోనం పెట్టొద్దు'...! దళితులను గుడిలోకి రాకుండా అడ్డగింత, సిద్ధిపేట జిల్లాలో ఘటన

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 30 Aug 202404:42 PM IST

Telangana News Live: Caste Discrimination : 'మీరు బోనం పెట్టొద్దు'...! దళితులను గుడిలోకి రాకుండా అడ్డగింత, సిద్ధిపేట జిల్లాలో ఘటన

సిద్ధిపేట జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించేందుకు దళితులు ఆలయానికి వెళ్లగా… ఇతర కులస్తులు నిరాకరించి అడ్డుకున్నారు. ఈ ఘటన  మర్కుక్‌ మండలంలోని శివారు వెంకటాపూర్‌లో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పలు బహుజన సంఘాల నాయకులు.. దళిత కుటుంబాలకు మద్దతు తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202403:43 PM IST

Telangana News Live: Mahabubabad News : భర్తకు రెండో పెళ్లి - దగ్గరుండి గ్రాండ్ గా జరిపించిన భార్య

 మహబూబాబాద్ జిల్లాలో వింత ఘటన వెలుగు చూసింది. భర్తకు భార్యే దగ్గరుండి రెండో పెళ్లి చేసింది. పెళ్లి పెద్దగా మారి… గ్రాండ్ గా వేడుకను నిర్వహించింది. ఈ మ్యారేజ్ వార్త.. సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వివాహిత తీసుకున్న నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202412:07 PM IST

Telangana News Live: Congress: నా నాలుక మీద పుట్టుమచ్చ ఉంది.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సీఎం అవుతారు: కోమటిరెడ్డి

Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అని సంబోధించారు. రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202410:58 AM IST

Telangana News Live: Yadagirigutta Temple : టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయండి - సీఎం రేవంత్ ఆదేశాలు

టీటీడీ బోర్డు మాదిరిగా యాదగిరిగుట్ట టెంపుల్‌ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆలయ అభివృద్ధి పనులు ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ‘స్పీడ్‌’ ప్రాజెక్టులపై సచివాలయంలో సమీక్షించిన ఆయన.. ఎకో, టెంపుల్‌ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202409:59 AM IST

Telangana News Live: Dating Apps: డేటింగ్ యాప్స్‌తో జాగ్రత్త.. వలపు వల వేస్తే.. గిలగిలా కొట్టుకుంటారు!

Dating Apps: డేటింగ్ యాప్‌లో పరిచయం అవుతారు. మాటలతో మైమరపిస్తారు. వలపు వల విసిరి.. డబ్బులు దండుకుంటారు. అవును.. హైదరాబాద్ నగరంలో డేటింగ్ యాప్స్‌తో ఇప్పుడు పెద్ద దందానే నడుస్తోంది. ఈ దందాలో కేవలం అమ్మాయిలే కాదు.. పబ్‌లు, క్లబ్‌లు కూడా ఉంటున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202409:14 AM IST

Telangana News Live: CCTV Footage: పాపం చిన్నారి.. రెప్పపాటులో ప్రమాదం.. తేరుకునే లోపే..

CCTV Footage: అసలే వర్షాకాలం. ఆపై వాహనాల రద్దీ. ఇలాంటి సమయంలో చిన్న పొరపాటు కూడా ప్రాణాల మీదకు వస్తుంది. తాజాగా హైదరాబాద్‌లోని హబ్సిగూడలో అదే జరిగింది. రెప్పపాటులో ఓ లారీ చిన్నారిని చిదినేసింది. ప్రమాదం నుంచి తేరుకునే లోపే పాప చనిపోయింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202409:04 AM IST

Telangana News Live: BRAOU Updates : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్, లింక్స్ ఇవే

Ambedkar Open University Updates: డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.  డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలకు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తుల గడువు రేపటితో(ఆగస్టు 31) పూర్తి కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://www.braouonline.in/  వెబ్ సైట్ లోకి దరఖాస్తు చేసుకోవచ్చు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202408:00 AM IST

Telangana News Live: Hydra: అందరికీ ఒకే న్యాయమైతే.. ఒవైసీ కాలేజీని కూల్చాలి.. హైడ్రాపై బండి సంజయ్ కీలక కామెంట్స్

Hydra: హైడ్రాపై రాజకీయ నాయకులు భిన్నంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు హైడ్రాను సపోర్ట్ చేస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు హైడ్రాపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ హైడ్రా తీరుపై విమర్శలు చేశారు. కక్ష సాధింపు చర్యల్లా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202407:49 AM IST

Telangana News Live: Siddipet Crime: సిద్ధిపేట లో రోడ్డు మీదే గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన వృద్ధుడు…

Siddipet Crime: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోడకండ్ల గ్రామం వద్ద రాజీవ్ రహదారి పక్కన ఘోర సంఘటన చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మధాపూర్ గ్రామానికి చెందిన ఏరుకుల రాజయ్య గౌడ్ (60) అనే వ్యక్తి కత్తితో గొంతు లో పొడుచుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202406:39 AM IST

Telangana News Live: Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. 2280 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌!

Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవలే డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు జూనియర్ కాలేజీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీలైనంత తొందరగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202406:00 AM IST

Telangana News Live: Revanth Reddy: న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంది.. బేషరతుగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా: రేవంత్

Revanth Reddy: సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు. తాను విచారం వ్యక్తం చేస్తున్నానని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపాదించారని ట్వీట్‌ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు పోస్టు చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202404:35 AM IST

Telangana News Live: HYDRA: స్పీడ్ పెంచిన హైడ్రా బుల్డోజర్లు.. రంగనాథ్ అస్సలు తగ్గడం లేదుగా!

HYDRA: హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరింత దూకుడు పెంచారు. రెండ్రోజుల కిందట పరిశీలించిన రాంనగర్ మణెమ్మ కాలనీ ప్రాంతంలో కూల్చివేతలు స్టార్ట్ చేయించారు. దీంతో రంగనాథ్ తర్వాత ఎక్కడికి వెళ్లి పరిశీలిస్తారో అనే చర్చ జరుగుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202403:58 AM IST

Telangana News Live: IMD Alert: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్

IMD Alert: తెలంగాణలో వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202402:53 AM IST

Telangana News Live: Ramagunda Spl Drive: రామగుండం కమీషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్..నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేకుంటే చర్యలు

Ramagunda Spl Drive: రామగుండం కమిషనరేట్ పరిధిలో పోలీసులు సెప్టెంబర్ 3 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నారు. సెప్టెంబర్ 2 రాత్రిలోగా వాహనాలపై ప్రెస్ , పోలీస్, ఆర్మీ లాంటి స్టిక్కర్స్, నంబర్ ప్లేట్స్ పై వివిధ రాతలు,  కార్ల అద్దాలపై  బ్లాక్ ఫిల్మ్  తొలగించుకోవాలని సిపి శ్రీనివాస్ సూచించారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202401:35 AM IST

Telangana News Live: Ponnam Prabhakar: భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామన్న మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదన్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్… వాటిపై ప్రజా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు.హైదరాబాద్ లో హైడ్రా కంటే ముందే కరీంనగర్ లో భూ కబ్జాలు,అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 30 Aug 202401:08 AM IST

Telangana News Live: Karimnagar Loan Apps: ప్రాణం తీసిన లోన్ యాప్, కరీంనగర్‌లో ఒకరి మృతి… మరొకరికి ప్రాణాపాయ స్థితిలో చికిత్స

Karimnagar Loan Apps: లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు మితిమీరాయి.‌ వేదింపులు బరించలేక ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. ఒకరి మృతి చెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్నాయి

పూర్తి స్టోరీ చదవండి

Read Entire Article